
పామిడి, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ టి.సి వరుణ్ గారి సూచనల మేరకు పామిడి మండలం నిస్వార్థ సైనికులతో పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండల అధ్యక్షుడు నియామకము మరియు కార్యకర్తలు స్థితిగతులు, మండలంలో పార్టీ బలోపేతం భవిష్యత్ కార్యాచరణ అనే ప్రధానం అజెండాతో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.