
నెల్లూరు టౌన్, (జనస్వరం) : ముస్లిం మైనారిటీ విద్యార్థులకు 100శాతం స్కాలర్ షిప్ ను మంజూరు చేయాలని ముస్లిం మైనారిటీ జిల్లా నాయకులు షేక్. షాన్వాజ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ అధికారి సయ్యద్ అబ్దుల్ హమీద్ ను కలిసి మైనార్టీల సమస్యలపై వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. ఇటీవల వచ్చిన వరదల వలన ఇళ్లలోకి నీరు వచ్చి విద్యార్థులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర విద్యాపత్రాలు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయాయన్నారు. అంతేగాకుండా మైనారిటీ స్కాలర్ షిప్ లకు సబంధించి పూర్తి సమాచారం లేక ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. స్కాలర్ షిప్ దరఖాస్తు డిసెంబరు 15వ తేదీతో ముగిసిందని ప్రకటించారని మైనార్టీలకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు గడువును పొడగించాలని కోరారు. షాన్వాజ్ వెంట మైనార్టీ నాయకులు సాదిఖ్ భాయి, లక్ష్మీమల్లేశ్వరరావు, ఇబ్రహీం, సిరాజ్ భాష తదితరులు పాల్గొన్నారు.