Logo
Date of Publish : 12 August 2021, 1:31 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 9వ రోజు సేవా కార్యక్రమాలు

                         జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు మాసోత్సవాలలో భాగంగా జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో సభ్యులు శ్రీ కోడిదేల ముద్దుకృష్ణ గారి సహకారంతో కడప నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ సుంకర శ్రీనివాస్, మరియు కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ పండ్రా రంజిత్ కుమార్, గార్ల చేతుల మీదుగా గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి కోలుకున్న జర్నలిస్ట్ శ్రీ నరసయ్య గారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడి కరోనా మహమ్మారితో పోరాడి కోలుకోని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రముఖ కడప జర్నలిస్టు నరసయ్య గారికి జనసేన ఎన్నారై సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సంస్థ సభ్యులు శ్రీ కొడిదెల ముద్దుకృష్ణ గారు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. గత 3 సంవత్సరాలుగా 30 రోజులు 30 ప్రాంతాలు 30 సేవా కార్యక్రమాలు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాల వారికీ, పేద ప్రజానీకానికి, వృద్ధులకు, నిరుపేద అభాగ్యులకే, కాకుండా సమాజం కోసం, ప్రజా సమస్యల పట్ల బాధ్యత వహిస్తున్నటువంటి జర్నలిస్టులకు కూడా అండగా నిలబడడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలే శివ, పత్తి విస్సు, సుండుపల్లి రాజా, తోట సుమన్, పుత్తా రాజు, పవన్ కుమార్, నాగరాజు, మిరియాల అనిల్, పవన్, మహమ్మద్, గోపాల్ నాయక్, పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com