
కడప ( జనస్వరం ) : జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 7వ రోజు బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్లలో జరిగింది. నిరంతరం జనసేన పార్టీ కోసం కష్టపడుతూ, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న జనసైనికుడు నందకిశోర్ రోడ్డు ప్రమాదంలో కాలు దెబ్బతిన్నది. జనసేన పార్టీ తరుపున జనసేన NRI సేవా సమితి గౌరవ సభ్యులు చీర్ల మల్లికార్జున్ దాతృత్వం తో నంద కిషోర్ కు రూ.10,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కమీటీ సభ్యులు, స్థానిక జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ వారు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్ గారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవనాశి ఈశ్వర్ రెడ్డి, గిరి ప్రసాద్, శీన౦శెట్టి లక్ష్మయ్య, నరసింహా తదితర జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.