Logo
Date of Publish : 26 September 2022, 3:03 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ ఆధ్వర్యంలో 7 వ రోజు గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన

      పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గ వీరఘట్టం మండలం, గంగంపేట పంచాయతీ రామాపురం గిరిజన గ్రామంలోని ప్రజా సమస్యలు, గ్రామ సమస్యలును వీరఘట్టం మండలం జనసైనికులు ఇంటింటికీ తిరిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూసి అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అవినీతి తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం సమస్యల మీద స్పందించడమే మానేశారు. అవినీతినీ ప్రోత్సహిస్తున్నారు. ప్రజాసమస్యలను గాలికొదిలేశారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను ఏం చేస్తున్నారో తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు లేవు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే కోట్లాది రూపాయలు ఏమవుతున్నాయి అని మత్స పుండరీకం ప్రశ్నించారు. జనసేన జాని మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన నాయకులు ప్రజలను పట్టి పీడిస్తున్నారు. ప్రజలకు ఎటువంటి రాయితీలు రాకుండా చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో అభివృద్ధి అనేది లేకుండా చేశారు. చాలా దారుణమైన పరిస్థితి లో ఇక్కడ ప్రజలు వున్నారు. అర్హులైన వారికి విద్యుత్ బిల్లు సాకు చూపించి వారి పెన్షన్లు, పథకాలు తొలగిస్తున్నారు. కర్ణేన సాయి పవన్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ధనిక అని తేడా లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం లో ప్రతి ఇంట్లో సమస్యలు కనిపిస్తున్నాయి అని ఒక్కో గ్రామంలో ఒక్కో రకమైన సమస్య ఉందని ఆయన తెలిపారు. ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రినీ చేసుకోవాలని కోరుకుంటున్నారుని సాయి పవన్ అన్నారు. రాజు మాట్లాడుతూ గ్రామ గ్రామన జనసేన పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రoలో విజయకేతనం ఎగురవేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడి వెంకటరావు నాయుడు, దూసి ప్రణీత్, అన్ను రామకృష్ణ, కంటు మురళి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com