గజపతినగరం ( జనస్వరం ) : నియోజకవర్గ సమన్వయకర్త మర్రాపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య పత్రికా సమావేశంలో గజపతినగరం నియోజకవర్గంలో 780 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశామని, నియోజవర్గం మొత్తం రోడ్లు వేసామని, ప్రతి ఇంటికి నీరు అందిస్తున్నామని అన్నారు. నాడు నేడులో భాగంగా అన్ని పాఠశాలలు ఆధునీకరణ చేశామని గొప్పగా చెబుతున్నారు. జనసేన పార్టీ రోడ్లు పరిస్థితి పై రెండుసార్లు నిరసన కార్యక్రమం నియోజకవర్గంలో భారీ స్థాయిలో చేసాం. పల్లె పల్లెకు జనసేన అనే కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజలను కలిసి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం పై ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో మీకు వచ్చే ఎలక్షన్లో తెలుస్తుంది. మీడియా సమావేశం ద్వారా త్వరలో మీరు చేసే అభివృద్ధి ఏంటో తెలియజేస్తాం. ఎక్కడ చూసినా గుంతలు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అతి దారుణంగా ఉంది. 30 పడకల హాస్పిటల్ ని 100 పడకల హాస్పత్రిని మాయ మాటలు చెప్పి, ఒక బెడ్ మీద ఇద్దరు పేషెంట్లని వైద్యం అందిస్తున్నారు. మీకు వీడియోలో ఫోటోలు రూపంలో మీకు అందిస్తాం, సరైన సదుపాయాలు హాస్పిటల్ లేక పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో గజపతినగరం నియోజకవర్గ ప్రజల్నిని పట్టించుకోకుండా, ఇప్పుడు పత్రికా సమావేశం పెట్టి ఏదో అభివృద్ధి చేసామని మాయ మాటలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరు చేసే భూఅక్రమాలు, ఇల్లీగల్ మైనింగ్, భూదందాలు, పంట పొలాలని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి, వేళ్ళ కోట్లు ప్రజాధనాన్ని దోచుకుని, త్వరలో ప్రజలు మీకు బుద్ధి చెబుతారు. రానున్నది జనసేన తెలుగుదేశం ప్రజా ప్రభుత్వం అని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రాపు సురేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి బాబు పాలురు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com