Logo
Date of Publish : 27 January 2026, 10:59 am
Editor : Sake Naresh

ఘనంగా కేంద్రీయ విద్యాలయంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా శ్రీ పి ఎం కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సత్తెనపల్లి,జనవరి 26 ( జనస్వరం)

కేంద్రీయ విద్యాలయం, సత్తెనపల్లె ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహం, వైభవం తో నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ప్రముఖ సామాజిక సేవకురాలు సాధనా గుప్తా హాజరయ్యారు.గౌరవ అతిథి చేతులమీదుగా జాతీయ పతాకావిష్కరణ జరగగా, అనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలకు నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.విద్యా మరియు సహపాఠ్య కార్యకలాపాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథి మరియు ప్రిన్సిపాల్ జగదీశ్ కుమార్ గుప్తా సంయుక్తంగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
తన ప్రసంగంలో సాధనా గుప్తా విద్యార్థుల క్రమశిక్షణను, కేంద్రీయ విద్యాలయాల విలువల ఆధారిత విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ కేంద్రీయ విద్యాలయం విద్యార్థినిగా చదివే అవకాశం నాకు దక్కి ఉంటే బాగుండేదని అనిపించింది” అని వ్యాఖ్యానించారు.ప్రిన్సిపాల్ జగదీశ్ కుమార్ మాట్లాడుతూ   గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, ఢిల్లీలోని ‘కర్తవ్య పథ్’ వద్ద కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శన దేశ గౌరవాన్ని పెంచిందని తెలిపారు.తదుపరి క్రీడా పోటీలు నిర్వహించి చివరగా జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com