- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నియోజకవర్గం ఇంఛార్జి గౌతమ్ కుమార్.
- జనసేన నాయకులు చాబాల నరేంద్ర ఆధ్వర్యంలో పార్టీలోకి ఆహ్వానించిన నియోజకవర్ఘం ఇంఛార్జి గౌతమ్ కుమార్
• వజ్రకరూరు మండల అధ్యక్షులు కేశవ మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో పర్యటిస్తామని తెలియచేశారు
• ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం సమిష్టిగా పనిచేయాలని కోరారు.
• చాబాల నరేంద్ర మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని తెలియజేశారు.
ఉరవకొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉరవకొండ లో పలువురు యువత జనసేన పార్టీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఉరవకొండ నియోజకవర్గం చాబల, హోతురు, ప్యాపిలి గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకి చెందిన యువత జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఉరవకొండ కేంద్రంలోని జనసేన కార్యాలయంలో నరేంద్ర ఆధ్వర్యంలో ఇంచార్జి గౌతమ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ... పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. మీకు అన్నివేళలా తాను అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, వజ్రకరూరు మండల అధ్యక్షులు ఆచనాల కేశవ, జనసేన నాయకులు గుడిసెల రాజేష్, హరి శంకర్ నాయక్, సూర్యనాయక్, మణికుమార్, సోము, వంశీ, మనోహర్, భీమేష్, మహేష్ హరున్, రాజేష్, హరి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com