Search
Close this search box.
Search
Close this search box.

600 కోట్లు. జైలర్ ఊచకోత కొనసాగుతూనే ఉంది

జైలర్

        ఫస్ట్ డేనే ఈ సినిమా వంద కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండున్నర రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసి… మూడు రోజుల్లోనే 200 కోట్లకు పైగా రాబట్టింది. ఆగస్టు 10న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా… మొదటి ఆరు రోజుల్లో 400 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో ఫాస్టెస్ట్ 400 కోట్ల క్లబ్‌లో చేరిన తమిళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది జైలర్. పొన్నియన్ సెల్వన్, విక్రమ్ సినిమాల కలెక్షన్స్ ని సెకండ్ వీక్ లో క్రాస్ చేసిన జైలర్ సినిమా, ఇప్పుడు కోలీవుడ్ లో రోబో 2.0 తర్వాత అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సెకండ్ ప్లేస్ లో ఉంది. తమిళ, తెలుగు, ఓవర్సీస్ మర్కెట్స్ లో జైలర్ సినిమాకి పోటీ ఇచ్చే సరైన సినిమా ఈ వీక్ కూడా రిలీజ్ కాలేదు కాబట్టి ఈ వీకెండ్ కూడా రజినీకాంత్ ర్యాంపేజ్ కొనసాగనుంది. ఇప్పటికే 580 కోట్లకి పైగా రాబట్టిన జైలర్ సినిమా ఈ వీకెండ్ ముగిసే సరికి 600 కోట్ల మార్క్‌ని టచ్ చేయడం గ్యారేంటీ. ఇదే జరిగితే జైలర్ సినిమాని ఇప్పట్లో వేరే హీరో అందుకోవడం కష్టం.

          నిజానికి రజినీకాంత్ హిట్ స్ట్రీక్ లో ఏం లేడు… తన రేంజ్ హిట్ కొట్టి చాలా రోజులే అయ్యింది. జైలర్ సినిమాకి సరిగ్గా ప్రమోషన్స్ ని కూడా చేయలేదు. వారం రోజుల ముందు చేసిన ఆడియో లాంచ్, హుకుమ్ సాంగ్ లు మాత్రమే ప్రమోషన్స్ లో కిక్ ఇచ్చాయి. ఇలాంటి టైంలో కూడా మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చేసిన జైలర్ సినిమా, రజినీకాంత్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసేలా చేసింది. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఎన్నేళ్లు హిట్ లేకపోయినా రజినీ అనే వాడికి ఒక యావరేజ్ సినిమా పడినా చాలు బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్ల సునామీ చూస్తామని నిరూపిస్తోంది జైలర్. రజినీకాంత్ పుణ్యమాని 600 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమా చేసిన దర్శకుడిగా నెల్సన్ పేరు కోలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసింది. నెల్సన్ కన్నా ముందు శంకర్ ఈ రేర్ ఫీట్ ని సాధించాడు. శంకర్ కూడా ఈ ఫీట్ ని రజినీకాంత్ సినిమాతో సొంతం చేసుకోవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way