ఎమ్మిగనూరు జనసేనపార్టీలో చేరిన 60 మంది యువకులు, గోనెగండ్ల మండల కమిటీ ఎంపిక
గోనెగండ్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 60 మంది యువకులు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఎమ్మిగనూరు పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీలో చేరారు. ఈ సందర్బంగా రేఖగౌడ్ మాట్లాడుతూ రాజకీయాల్లో యువత ఆవశ్యకత ఎంతో కీలకమని పార్టీకి కీలకం యువశక్తినే పార్టీ శ్రమశక్తి అన్నారు. జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించేతత్వం యువతతోనే సాధ్యమని ఎవరు సాహసించని విధంగా అత్యధిక స్థానాల్లో యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తూ ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక పార్టీ జనసేనపార్టీ అని కొనియాడారు. రాబోవు స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన యువతను గుర్తిస్తామని వాడ వాడలో జనసేన జెండా ఎగిరేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని అన్నారు. సమస్య ఏదైనా పరిష్కరించే మార్గం జనసేనకే సాధ్యమనేలా ప్రజలు గుర్తించేలా పనిచేద్దామని ప్రస్తుతం ఎక్కడ చూసినా భవననిర్మాణ కార్మిక రంగం చతికిలపడిందని అధిక వర్షాలకు రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని కార్మికులకు ఇసుక కొరత తీర్చాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కృషిచేస్తు కొన్నిచోట్ల జరుగుతున్న అవినీతిపై పోరుకు సిద్ధం కావాలని అన్నారు. సేవా మార్గాల్లో అధినేత అడుగు జాడల్లో నడుస్తూ భావితరాల భవిష్యత్ కోసం పనిచేస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ ఆశయలకు అనుగుణంగా పనిచేసి ప్రతి జనసేన యువకుడు సైనికుడే అనేలా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల పరిధిలోని పుట్టపాశం, కైరవాడి, కులుమాల కున్నూరు గంజాహళ్లి, గ్రామాలకు చెందిన యువకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
గోనెగండ్ల మండల కమిటీ ఎన్నిక
ఎమ్మిగనూరు జనసేనపార్టీ కార్యాలయంలో ఆదివారం రోజు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ గోనెగండ్ల మండల నూతన కమిటీని ప్రకటించారు, మండల అధికార ప్రతినిధిగా ఎ జాని, మండల ప్రధానకార్యదర్శిగా రామాంజనేయులు, వీర మహిళ అధికార ప్రతినిధిగా పద్మావతి, కార్యనిర్వహణ కార్యదర్శులుగా ఖాసీం, భాస్కర్, ప్రచార కార్యదర్శిగా హరికృష్ణ, కార్యదర్శులుగా, జనార్దన్, షఫీ లను నియమించారు. పార్టీని బలోపేతం చేయుటకు మండల కమిటీలో ఎన్నికైన నాయకులు సైనికుల్లా పనిచెయ్యాలన్నారు. గోనెగండ్ల మండల పరిధిలోని అన్ని గ్రామలలో గ్రామ కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు.