Logo
Date of Publish : 22 July 2021, 3:42 pm
Editor : Sake Naresh

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన జనసైనికుడు కుటుంబానికి జనసేన పార్టీ తరుపున 6 లక్షల ఆర్థిక సాయం

          కర్నూలు జిల్లా తుగ్గలి మండలం R.S పేండేకల్లు గ్రామానికి చెందినటువంటి జనసైనికుడు అయినా ఇమాంవలి పేండేకల్లు గ్రామంలో పీర్ల చావిడికి పెయింట్ వర్క్ చేస్తుండగా అకస్మాత్తుగా HT 11kv వైర్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలడం జరిగింది. చేయికి భయంకరంగా దెబ్బ తగలడంతో  R. S పేండేకల్లు కర్నూల్ GGH హాస్పిటల్ నందు అడ్మిట్ చేసి  డాక్టర్స్ ఎడమ చేయి మోచేతి వరకు మరియు రెండు కాళ్ళ వేళ్ళు తొలగించడం జరిగింది. ఇమాంవలి వయస్సు 26 సంవత్సారాలు తనకు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల వయస్సు 8 నెలలు ఇమాంవలి రోజు కూలీకి వెళ్తే కానీ పూట గడవదు. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లడంతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరపున 6 లక్షల రూపాయలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు, మరియు అనంతపురం జిల్లా అధ్యక్షుడు శ్రీ టి. సి వరుణ్ గారు  అలాగే కర్నూలు జిల్లా నాయకులు చింత సురేష్ గారు , రేఖ గౌడ్ గారు, చల్లా వరుణ్ గారు, హర్షత్, పత్తికొండ రాజశేఖర్ గారి, చేతులమీదుగా ఇమాంవలి కుటుంబానికి 6 లక్షల రూపాయల చెక్ ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com