
అనంతపురం, (జనస్వరం) : రాయలసీమ బలిజ మహా సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ దేవరాయలు 551 జయంతి అనంతపురంపురం పట్టణమునందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపుర ప్రముఖులు, బలిజ సంగీయులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారు పాల్గొని రాయలసీమ జిల్లాలో ఏదో ఒక కొత్త జిల్లాకు శ్రీ కృష్ణ దేవరాయలు పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.