
మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లె నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం ప్రచారంలో భాగంగా 51 ఒక రోజు బెంగళూరు బస్టాండు పటేల్ రోడ్డు సర్కిల్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. కోలాహలంగా తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్య ప్రచారం నిర్వహించి ఉమ్మడి అంశాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్ అధ్యక్షతన ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దారం హరిప్రసాద్, శ్రీరామ హరిహరన్, వరుణ్ వర్మ, కోట వారి పల్లి ఉదయభాస్కర్, కోటకొండ చంద్రశేఖర్, ఆకుల శంకర, గోపాల్, హర్ష, ధరణి, సోను, యాసిన్ చంద్రశేఖర్, పద్మావతి, మరియు పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.