
అనంతపురం, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత మహిళలు అన్ని రంగాలలో ముందుండాలనే ఉద్దేశంతో మహిళ సాధికారిక, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు మహిళలకు ఉచిత టైలరింగ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, డిజైన్ పెయింటింగ్ వర్క్ వంటి వాటిని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శిక్షణా తరగతులు 50రోజులకు చేరుకున్నందుకుగాను శిక్షణ పొందుతున్న మహిళలు కేక్ కట్ చేసి మాకు ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి, రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలతకి కృతజ్ఞతలు తెలుపుతూ మహిళల అభివృద్ధి కోసం జనసేన పార్టీ ముందడుగులో ఉందని తెలియజేశారు.