Logo
Date of Publish : 03 April 2023, 3:10 pm
Editor : Sake Naresh

గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన 50 మంది యువకులు

        నెల్లూరు ( జనస్వరం ) : బుచ్చి రెడ్డి పాలెం, కోవూరు నియోజకర్గంలోజనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యం లో జనసేన పార్టీలో చేరిన 50 మంది యువకులు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీకి మంచి ఆదరణ ఉంది, రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అని అందరూ నమ్ముతున్నారు. కార్యకర్తలంతా కూడా క్రమశిక్షణ, నిబద్ధతతో వ్యవహరించాలి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఏదైనా కూడా దానికి కట్టుబడి జనసేన పార్టీని మీరందరూ గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై మండల అధ్యక్షుడు సాయంతో పోరాడాలి,బాధితులకు న్యాయం కల్పించే క్రమంలో జిల్లా యంత్రాంగం, లీగల్ కమిటీ తోడుగా ఉంటారు. గత ఎన్నికల్లో కూడా స్వచ్ఛందంగా బుచ్చిరెడ్డిపాలెం నుంచి జనసేన పార్టీకి మద్దతు లభించింది. జనసేన కార్యకర్తలు నాయకులంతా కూడా జనసేన పార్టీ మీద ఉన్న అభిమానాన్ని,ఓటు బూతులు దాకా తీసుకెళ్లి ఓటు వేయించేటట్లు కృషి చేయాలి. గడిచిన 4 నెలల్లో వైసీపీ సాధించిన అభివృద్ధి శూన్యం. ఇసుక దందా ఎక్కువైపోయింది, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వైసిపి నాయకులు కోట్లు వెనకేసుకుంటున్నారే గాని స్థానిక ప్రజలకు విద్యా ఉపాధి కల్పనలో విఫలమయ్యారు. గ్రామాల కనెక్టివిటీ రోడ్లు అద్వాన్నంగా ఉన్నా, అకాల వర్షాలకు కష్టపడిన రైతులకు పరిహారం లేక అల్లాడుతున్న వాటిని పట్టించుకునే వారే లేరు. రానున్నది ప్రజా ప్రభుత్వం జనసేన ప్రభుత్వం మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు జనసేన పార్టీ సిద్ధాంతాలకు వారదులుగా వ్యవహరించి జనాలకు చేరువై పార్టీని గెలిపించాలి. ఈ కార్యక్రమంలో కిషోర్ తో సాయి, షారు, కాషిఫ్, షాజహాన్,రుషి,షామీర్, నవీన్, ప్రసాద్, ప్రశాంత్ గౌడ్, హేమ చంద్ర యాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com