Logo
Date of Publish : 14 October 2021, 10:06 am
Editor : Sake Naresh

చిలకం మధుసూధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరిన 50 టిడిపి కుటుంబాలు

    ధర్మవరం, (జనస్వరం) : తాడిమర్రి మండలం ఆత్మకూరు గ్రామంలోని టిడిపికి చెందిన 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి గారి నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిలకం మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీకి పెరుగుతున్న  ప్రతిష్టకు మెచ్చి పెద్దఎత్తున తమ పార్టీలో చేరేందుకు సన్నద్దులవుతున్నట్లు తెలిపారు. తమ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పార్టీ నిర్వహణ, ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు, పథకాల అమలులోని ప్రశ్నిస్తున్న విధానాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందని  ఆయన తెలిపారు. పార్టీ ప్రతిష్టకు, పార్టీ బలోపేతానికి పాటు పడాలని ఆయన పార్టీలో చేరిన వారిని కోరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వీరాంజనేయులు, రాఘవ, రమేష్‌, రామాంజనేయులు, గంగాధర్‌లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌  తీసుకుంటున్న  విధివిధానాలకు మెచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. జయరామంజనేయులు, సాంభ, ప్రకాష్‌రెడ్డిల ఆధ్వర్యంలో పార్టీలో చేరినవారిలో సూర్యనారాయణ, హరి, అరుణ్‌, తరుణ్‌, శివయ్య, హరికిరణ్‌, కార్తీక్‌, అదెప్ప, యుగంధర్‌, సలీం, రాజ సుధాకర్‌, బాబులతో పాటు పలువురు ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com