
ఈ కరోనా విపత్కర సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి చలించిపోతున్నాం. ఇటువంటి తరుణంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు Together4India కన్సార్టియం (Navya, CPI, TMC, IANH), USA మరియు ఆసరా FOUNDATION వారితో మాట్లాడి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని వివరించారు. వారు వెంటనే 50 కాన్సెంట్రేటర్స్ అందించడానికి ముందుకు వచ్చారు. ఆ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ను అరిలోవలో గల GVMC 850 బెడ్స్ COVID CARE హాస్పిటల్ కి 40 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ GVMC కమిషనర్ సృజన గుమ్మళ్ళ గారికి అందించడం జరిగింది. జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు మాట్లాడుతూ 50 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ అందించిన ఫౌండేషన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో ఉన్న ఫౌండేషన్స్ తో మాట్లాడి ఈ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ అందించడానికి సహకరించిన దబ్బి ప్రసాద్ (USA), దబ్బి రాంబాబు, దబ్బి శేషు కుమారి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.