
ఆళ్లగడ్డ, (జనస్వరం) : ఆళ్ళగడ్డ నియోజకవర్గం, దొర్నిపాడు మండలం, క్రిష్టిపాడు గ్రామంలో ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య సమక్షంలో జనసేనపార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి వైసీపీ పార్టీకి చెందిన 50 మంది ఎస్సీ, బీసీ, మైనారిటీ కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులను రాజకీయంగా ఆర్థికంగా సమాజంలో ఎదుగుదల కొరకు బడుగు బలహీన వర్గాలను పల్లకిలో ఎక్కించడానికి జనసేన పార్టీ స్థాపించారని తెలియజేశారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఏ పార్టీ నాయకులు కూడా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడలేదని రాజకీయ అవకాశాలు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు దూరం చేశారని, కనుక బడుగు, బలహీన వర్గాలకు జనసేన పార్టీలో కీలక పదవులు కూడా ఆయా వర్గాలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలే లేకుండా అణచివేతకు గురి చేస్తున్న పవన్ కళ్యాణ్ ధైర్యంగా ప్రజాసమస్యల మీద పోరాటం చేస్తూ 2024 సార్వత్రిక ఎలక్షన్లో రాజ్యాధికారమే దిశగా పనిచేస్తున్నారని అలాంటి నిజాయితీగల నాయకుడికి ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని ఆదరించాలని తెలియజేశారు. ఆళ్ళగడ్డ జనసేన పార్టీలో చేరిన కుటుంబాలను అధికార పార్టీకి చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరితే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని అలాంటి తాటాకు చెప్పులకు జనసైనికులు ఎవరు భయపడరని వారి బెదిరింపులకు భయపడటానికి జనసేన పార్టీలో రోజువారి 500 కూలీకో, మందు బిర్యానీ, ప్యాకెట్లకు ఆశించి పని చేసే వాళ్ళు ఎవరూ లేరని జనసేనలో ఉన్నది కరుడుగట్టిన నిస్వార్థపు గుండెల నిండా ధైర్యం కలిగిన జనసైనికులు ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కట్టుబడి మహబూబ్ దౌలా, తిరుపంగాల పెద్ద ఓబుళపతి, ముసిగింసాగారి నన్నేబై, మాసూంగారి చిన్న భాష, పూల ఫకీర్ భాష, గుత్తి మస్తాన్ వలి, గడ్డం ఏసు పాదం, బడ్డేసాబ్ గారి హుస్సేన్ భాష, మద్దుబై గారి వలి, ముసిగింసా గారి హుస్సేన్ భాష, మారెన్న గారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.