బాపట్ల ( జనస్వరం ) : బాపట్ల పట్నంలో చీలు రోడ్డు లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏపీలోనే 2024లో జరుగుతున్న ఎలక్షన్లో దివ్యాంగుల 2016 హక్కుల చట్టం ప్రకారం దివ్యాంగులకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్, ప్రస్తుత అధికార పార్టీ, ప్రతిపక్షాల పార్టీ అందరూ కూడా ప్రకటన చేయాలని అన్నారు. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా దివ్యాంగుల రాజకీయ రిజర్వేషన్లు తీసుకువెళ్తామని అన్నారు. పార్లమెంట్ నుంచి పంచాయతీ వార్డు నెంబర్. వరకు దివ్యాంగుల ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాజకీయ పార్టీలకు డిమాండ్ చేస్తూన్నామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సంఘాల నాయకులు దివ్యాంగుల అన్నదమ్ములు అక్క చెల్లెలు పెద్ద వారందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఉండి ఈ ఒక్క ఐదు శాతం రిజర్వేషన్ పూర్తిస్థాయిలో అమలు చేసుకోవాలని రాజకీయ పార్టీల పైన ఒత్తిడి చేయాలని తెలియజేయడమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, సుంకర శ్రీనివాసరావు పాల్గొన్నారు.