Logo
Date of Publish : 13 May 2023, 7:44 pm
Editor : Sake Naresh

వంగ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో 46వ రోజు పాదయాత్ర

          నాగర్ కర్నూలు ( జనస్వరం ) : నాగర్ కర్నూల్ మండలం, కుమ్మెర గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్  నియోజకవర్గ నాయకులతో కలిసి గ్రామంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్  మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఒక వర్గ పాలనలో నలిగిపోతున్న నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒక వర్గ పాలనకు స్వస్తి పలకాలని చెప్పి పిలుపునిచ్చారు.. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలకు, నమ్మిచ్చి ఓటేసిన పాపానికి ప్రజలు బలవుతున్నారన్నారు.  ప్రజా సమస్యలు పరిష్కరించటానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 9 సంవత్సరాల నుంచి ఎక్కడలేని విధంగా అభివృద్ధి చేసినం అని మాయ మాటలు చెప్తూ, ఇప్పటికీ కూడా ఇంకా అధికార పార్టీ మాయ మాటలతో వారి పబ్బం గడుపుతున్నారు,,అంటే,,, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు అని మర్చిపోకండన్నారు.  బీరు, బిర్యానికి ఆశపడి కోటర్ కి ఆశపడే రోజులు అయిపోయినయి గుర్తుపెట్టుకోండి. వచ్చేది కొత్త తరం పాలన మారితే తప్ప మా బిడ్డల భవిష్యత్తు మారదని ప్రజలు భావిస్తున్నారు.  కుమ్మెర గ్రామ భు నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. కుమ్మెర గ్రామానికి పాలమూరు రంగారెడ్డి వట్టెం రిజర్వాయర్ పేరుతో, భూములు కోల్పోయిన రైతులకు తక్కువ పారితోషికం ఇచ్చి, పబ్బం గడిపిన అదికార పార్టీ నాయకుల వైనం. నిర్వాసితులకు అండగా జనసేన పార్టీ తోడుగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. కచ్చితంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో SC, BC, ST, మైనారిటీలు బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు ముందుకు వేయటం ఖాయం.! వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు గోపాస్ కుర్మన్న, మహేష్ గౌడ్, ఆరిఫ్, విజయ్ భాస్కర్ గౌడ్, సూర్య, నరసింహ, భాస్కర్, పూస శివ, సందీప్, శివ కుమార్, నాగరాజు, సంజెయ్, సాంబ శివుడు, మహేష్, సొంటి శ్రీశైలం, శివ, సతీష్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com