మదనపల్లి, (జనస్వరం) : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మదనపల్లి నియోజకవర్గంలో 45 రోజులుగా జనం కోసమే జనసేన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పల్లెల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని వివిధ శాఖల అధికారులు దృష్టి తీసుకువచ్చిన ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడమే జనం కోసమే జనసేన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. గత ఐదు రోజులుగా ఈ పాదయాత్రలో భాగంగా సిపిఎం గ్రామంలో పర్యటిస్తున్న సందర్భంలో సిటిఎం గ్రామంలోని మసీదు వీధిలో సుమారు 50 ఇండ్లకు డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, అలాగే శెట్టి వారి వీధిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, గొల్లపల్లి మిట్ట వీధిలో డ్రైనేజీ వ్యవస్థ రేపు పోవడం ఎస్టీ కాలనీలో వీధి దీపాలతో పాటు చాలామందికి కనీస గృహ సౌకర్యం లేక గుడిసెలు నివసిస్తున్న సమస్యల గురించి అలాగే చాలామంది సింగల్ ఉమెన్ వీడియో పెన్షన్స్ వితంతు పెన్షన్లు సమస్యల గురించి సిటిఎం గ్రామ సచివాలయంలోని సచివాలయం అధికారులకు అర్జీ సమర్పించి సత్వరమే ఈ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని లేనియెడల ఈ సమస్యల పరిష్కారం కోసం జనసేనపార్టీ కచ్చితంగా పొరపాటు పడుతుందని ఈ సందర్భంగా మై ఫోర్స్ మహేష్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గంగాధర, జై కుమార్, షాదుల్లా, చోటు, బబ్లు, జయంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com