శ్రీకాకుళం ( జనస్వరం ) : మందస మండలం భేతాళపురం గ్రామానికి చెందిన బైపల్లి సూర్య అనే వ్వక్తి ఉపాధికోసం బెంగుళూరు వెల్లి ఒక కర్రల మిల్లులో పనిచేస్తూ కుటుంబ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో బెంగుళూరులో రోడ్ ప్రమాదంలో మరణించడం జరిగింది. భార్య కూడా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు హరిపురంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. వారి కుటుంబానికి సొంతం ఇల్లు కూడా ఇప్పటివరకు లేదు, కుటుంబ రోజు కూలి చేసి వచ్చిన సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. పెద్ద అమ్మాయి శ్రీ పవనపుత్ర సేవా సంస్థ ద్వారా జరిగే సేవా కార్యక్రమాల్లో సభ్యురాలుగా ఉంది. విషయం తెలుసుకున్న సంస్థ సభ్యులు తమ కుటుంబ సభ్యురాలకి అండగా నిలబడాలని, సభ్యులు సహకారంతో 45,000 రూపాయిలు ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగింది. ఇద్దరి పిల్లలకు విద్య, ఉద్యోగం పరంగా ఏ సహాయం కావాలన్న అందిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మజ్జి భాస్కరరావు, కొల్లి ఫాల్గుణ, MPTC సురాడ వాసుదేవ్, రుంకు తరకేశ్వరరావు, కొంచాడ సత్యవీర్, ఎరుకోలా సోమేశ్వరరావు మాస్టర్, బిన్నాల శివ, తోగరాన వినోద్, నక్క అనిల్,కంచరన అనిల్, ఇంటెనుక ఆనంద్, పైల నాగార్జున, గుంటు గంగోత్రి, మహేశ్వరి, డొలై భాను, ఈరోతు మాధురి, షణ్ముఖరావు, భాస్కరరావు గ్రామస్తులు పాల్గొన్నారు.