37వరోజు జనం కోసం జనసేన కార్యక్రమం

జనం కోసం జనసేన

      సర్వేపల్లి ( జనస్వరం ) : తోటపల్లిగూడూరు మండలం కొత్త కోడూరు పంచాయతీ పట్టపుపాలెం నందు 37వరోజు గురువారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన నాయకులు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ కొత్త కోడూరు పంచాయతీ పట్టపుపాలెం గ్రామస్తులకు ఆ చుట్టుపక్కల ఉన్న పేదలందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పేదలకు ఇచ్చిన స్థలాలు కూడా చేపల చెరువులో 7 అడుగుల లోతులో ఉన్న గుంటల్లో ప్లాట్లు వేసి ఉన్నాయి. వర్షాలు వస్తే ఆ గుంట మొత్తం నిండిపోయే పరిస్థితి. పక్కనే ఉప్పు కాలువ కూడా ఉంది. ఉప్పు కాలువ పొంగినా గాని, ఆ గుంట నిండిపోయే పరిస్థితి. అక్కడ ఎలా ఇల్లు నిర్మించుకోవాలని పేదవాడికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. వైసిపి ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలనుంచి పేదవాడికి చేసింది ఏమి లేదు. పేదలకు ఇళ్ల స్థలాలు పండగలకు ఇస్తామని చెప్పి మాటలతో మభ్యపెడుతున్నారు. కానీ పండగలు వస్తున్నాయి, పోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, మళ్లీ ఎన్నికల కూడా రాబోతున్నాయి. ఇప్పటివరకు పేదవాడికి ఇచ్చిన ఇళ్ల స్థలాలు లేవు, కట్టించిన ఇల్లు కూడా పూర్తిగా ఇచ్చిన పరిస్థితులు లేవు. వైసిపి రాష్ట్ర ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసే విధంగా వాగ్దానాలు ఇచ్చింది. పేదవాడి సొంత ఇంటి నిర్మాణం చేసే పరిస్థితి లేదు. ఇక్కడ స్థానికులు కూడా వీళ్లు చేపల చెరువులో వేసిన ఇళ్ల స్థలాలకి మోగు చూపిన పరిస్థితులు లేవు. మాకొద్దని చెప్పి తిరగబడడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చేటప్పుడు అనువైన స్థలాల్లో ఇల్లు ఇస్తే నిర్మించుకొని నివాసముంటారు. అంతేగాని మీ స్వార్థాల కోసం, స్వార్ధ రాజకీయాల కోసం, మీ కడుపు నింపుకోవడం కోసం మాత్రం ఏదీ చేయబాకండి. ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాలతో ఆటాడుకోబాకండి మట్టిలో కలిసిపోతారు. రాబోయేది ప్రజా ప్రభుత్వం 2024లో జనసేన, టిడిపి కలిసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజల సమస్యలను పూర్తిస్థాయిలో తీర్చే విధంగా అడుగులు ముందుకు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు ఖాజా, వెంకటాచలం మండల కార్యదర్శి శ్రీహరి, స్థానికులు శ్రావణ్, నవీన్, పురుషోత్తం, నరేష్, మల్లికార్జున్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way