నక్కపల్లి, (జనస్వరం) : నక్కపల్లి మండలం, రాజయ్యపేట గ్రామంలో హెటిరో కంపెనీ బాధిత గ్రామాల మత్స్యకారుల శాంతీయుత ధర్నా 365 రోజులకు చేరుకున్న సందర్భంగా అఖిలపక్ష సమావేశ సభను నిర్వహించారు. ఈ శాంతియుత ధర్నాకి జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి, జనసేన రాష్ట్ర కార్యదర్శి బొడపాటి శివదత్, సి.పి.ఎమ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎమ్.అప్పలరాజు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగాా శివదత్ మాట్లాడుతూ 400 వ రోజు పూర్తయ్యే లోపు హెటిరో కంపెనీ యాజమాన్యం పైప్ లైన్లు పూర్తిగా తొలగించి భవిష్యత్తులో మరొకసారి ఇటువంటి లైన్ వెయ్యమని భరోసా కల్పించని యడల మత్స్యకారుల పోరాటానికి మద్దతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నక్కపల్లి నుంచి అనకాపల్లి వరకు భారీ పాదయాత్రతో జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేసారు. PAC సభ్యులు కోన తాతారావు మాట్లాడుతూ మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు మీకు కనపడటం లేదా, జగన్ రెడ్డి మానస పుత్రికగా వున్న మీకు ఇంత చిన్న చూపు తగదు, తక్షణమే స్పందించక పోతే స్థానిక నాయకులతో కలిసి భారీ ఉద్యమం చేపడతాం. రాష్ట్ర కార్యదర్శి అంగ ప్రశాంతి మాట్లాడుతూ చట్టపరంగా న్యాయశాఖ నుంచి కూడా ఒత్తిడి తీసుకువస్తాం.భీమిలి ఇంఛార్జి పంచకర్ల సందీప్ మాట్లాడుతూ మత్స్యకారులు కట్టిన నిరసన గోడే వైఎస్సార్సీపీ పార్టీ పతనానికి పునాది. విశాఖ నార్త్ ఇంఛార్జి ఉషా కిరణ్ మాట్లాడుతూ మత్స్యకారుల పోరాటం కోసం ఎంత దూరమైనా ఎన్ని సార్లు అయినా వస్తాం నిలబడతాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల లక్ష్మి, ముమ్మిని నాగమణి, కృష్ణయ్య, శ్రీను బాబు, మైలపల్లి నూకరాజు, కురందాసు అప్పలరాజు, పిక్కి స్వామి, బొంది గుర్రన్న, బాబుజి, రాజు బంగారి, అల్లాడ రమణ, పినపోలు సతీష్, గిరీష్, ఆనంద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.