మదనపల్లి ( జనస్వరం ) : 36 రోజు ప్రచారంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గంల రాజానగర్, చిన్నపయ్య నగర్ ప్రాంతాల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రచారం నిర్వహించడం జరిగింది. మౌళిక సదుపాయాలు కొరత ఈ ప్రాంతంలో తీవ్రంగా వున్నాయి. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ ప్రియాంక జనసైనికులు తుపాకుల ధరణి రాయల్, కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, తక్కోళ్ల శివ, యాసిన్, గణేష్ ,కోనేటి శ్రీనివాసులు ,షేక్ బహదూర్, రవి, హేమంత్ జనసేన నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com