Search
Close this search box.
Search
Close this search box.

శ్రీకాళహస్తి జనసేనపార్టీ ఆధ్వర్యంలో KNOW MY CONSTITUENCY 32వ రోజు

    శ్రీకాళహస్తి, (జనస్వరం) : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇంఛార్జ్ వినుత కోటా  ప్రారంభించిన  KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా తొట్టంబేడు మండలం, తాటిపర్తి హరిజనవాడలో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఇటీవల తిరుపతిలో పవన్ కళ్యాణ్  నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో తాటిపర్తి పంచాయతీలోని రైతులు తీసుకొచ్చిన సమస్యను పరిశీలించడం జరిగింది. 2017లో అప్పుడున్న ప్రభుత్వం రైతుల భూములు 250 ఎకరాలు కజేరియా కంపెనీకి కట్టబెట్టి ఇప్పటి వరకు దాదాపు 190 రైతు కుటుంబాలకు వారి భూమికి పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో వారు వచ్చిన వెంటనే పరిహారం అందిస్తామని, గెలిచాక రైతుల భూములకు ఇంత వరకు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయం చేసుకునే పంట పొలాలు లాక్కొని జీవనాధారం లేకుండా చేసి పొట్ట గొట్టారని రైతులు భాధని వ్యక్తం చేశారు. కజేరియా కంపెనీలో స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇపుడు ఇతర రాష్ట్రాల వారికి పెర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తూ స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించలేదని తెలిపారు. తప్పకుండా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ రైతులకు అండగా ముందుండి వారి భూములకు రావాల్సిన పరిహారం అందేలా అన్ని రకాలుగా పోరాటం చేస్తామని వినుత పార్టీ తరఫున ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు గణేష్, రవికుమార్ రెడ్డి, సురేష్, గిరీష్, జనసైనికులు బాలు, వెంకటేష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way