
మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి లో 34 వార్డులో జనసేన తెలుగుదేశం కలిసి 31 వ రోజు ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం నిర్వహించారు. జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ చిత్తూరు జిల్లా దారం అనిత అధ్యక్షత ఇంటింటా ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో పవర్ ఆఫ్ ద టీం అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, పట్టణ కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి వినయ్ కుమార్ రెడ్డి, ఆకుల శంకర, ధరణి కుమార్ రాయల్ గని, యాసిన్, పాల్గున మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు జనసేన వీర మహిళలు జనసైనికులు స్థానికులు పాల్గొన్నారు.