
ఆముదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గంలోని చిన్న గొల్లపేట గ్రామంలో జనసేన నాయకులు కొత్తకోట. నాగేంద్ర, కోరుకొండ. మల్లేశ్వరావు, MPTC. విక్రమ్ ఆధ్వర్యంలో చిన్న సాయి భవాని సమక్షంలో ఈరోజు గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు వివరించారు. 10మంది పిల్లలకు రెండు ప్రాథమిక పాఠశాలు ఉన్నాయని అన్నారు. ఇద్దరు పిల్లలు రాకపోతే రెండు పాఠశాలలు సెలవు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. రోడ్లు సమస్య, కాలువలు లేకపోవడం ఇంటి ముందు మురికి నీరు నిల్వ వుండడం వలన పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మహేష్, రుద్ర, మోహన్, కోమల్, హరీష్. మోహన్, ప్రదీప్,వినోద్ తదితరులు మరియు గ్రామ ప్రజలు జనసైనికులు పాల్గొన్నారు.