Logo
Date of Publish : 06 June 2022, 4:48 pm
Editor : Sake Naresh

మడకశిర నియోజకవర్గంలో 30మంది యువకులు జనసేన పార్టీలోకి చేరిక

          మడకశిర ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మడకశిర జనసేన అధ్యక్షుడు శివాజీ ఆధ్వర్యంలో జనసైనికుల సమక్షంలో పార్టీ కార్యకర్తల ప్రోద్బలంతో, అభిమానుల ప్రోత్సాహంతో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవము జరిగింది. పర్యవరణ పరిరక్షణ అనేది జనసేన పార్టీలో ఒక సిద్ధాంతం, రేపటి వాతావరణం భావితరాలకు భవిష్యత్ ఇచ్చేది ప్రకృతి పరమైన బాధ్యతని నమ్మే సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించి మరియు అభివృద్ధి చేయడం అని అన్నారు. ఈ సిద్ధాంతాన్ని పాటించే విధంగా ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. కేక్ కట్ చేసి ఆనందాల ఉత్సవంతో సంబరాలు జరుపుకోవడం జరిగింది. తదనంతరం జనసేన పార్టీ కర్తవ్యం విధి నిర్వహణ బాధ్యతగా పంచాయతీ పరిధిలో అన్ని గ్రామాలలో ప్రజా సమస్యలపై విజృంభించి వీధులలో ఊరేగింపుగా రోడ్ల వెంబడి తిరుగుతూ, పాదయాత్రగా ప్రతి ఇంటింటికి చేరి ప్రజలతో మమేకమై చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న రోడ్ల సమస్య గురించి, డ్రైనేజీ సమస్య, పేదరిక సమస్య ,నిరుద్యోగ సమస్య, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గానికి జనసేన పార్టీ అవకాశం చేస్తుందని అని తెలియజేసి గ్రామ ప్రజలందరికీ పర్యావరణ పరిరక్షణ గురించి వివరించడం జరిగింది. తదనంతరం శివాజీ మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల సమస్య పరిష్కారానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని, పదవులు పొందడానికి, అధికార దాహానికి, ప్రజల సొమ్ము దోచుకోవడానికి అవకాశం లేకుండా స్వచ్ఛంగా నిజాయితీగా ప్రజల సొమ్మును ప్రజల అభివృద్ధికి ఖర్చు పెట్టడానికి ప్రజా సంక్షేమానికి సమాజ అభివృద్ధికి దేశ పురోభివృద్ధికి కృషి చేయడానికి మా జనసేన పార్టీ దోహదం చేస్తుందని అన్నారు. అందుకే మా జనసేన పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి మీ వెంటే ఉంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీ విభాగం కోఆర్డినేటర్ T. ప్రసాద్, ఉపాధ్యక్షులు యశ్వంత్, ప్రధాన కార్యదర్శులు, విజయ్ కుమార్, శ్రీహరి, శ్రీనివాసులు రంగనాథ్, కార్యదర్శులు నాగభూషణం, పవన్ కళ్యాణ్, శశిప్రీతమ్, సంయుక్త కార్యదర్శులు పవన్ కుమార్, రాజు, రఘు, నరేష్, నాగార్జున, హ వై బిహళ్ళి పంచాయతీ జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com