సర్వేపల్లి ( జనస్వరం ) : వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామంలో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఆస్తోటి రవి సమక్షంలో 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీకి సేవలందిస్తున్న అస్తోటి రవి ద్వారా 30 కుటుంబాలు జనసేన కండువా కప్పుకొని పార్టీలోకి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల నుంచి ఈ అవినీతి పరిపాలన నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని కాపాడుకోవడం కోసం ఈరోజు యువత అందరూ కూడా మార్పు కోసం జనసేన వైపు అడుగులు ముందుకు వేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ కుటుంబాలకి జనసేన పార్టీ ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది. అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్ధిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జనసేన తెలుగుదేశం దెబ్బ వైసీపీకి అబ్బా అనిపించే విధంగా మార్పులు తీసుకొస్తాం. తదనంతరం సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా ఉమ్మడిగా అభివృద్ధి ఏవిధంగా ఉంటుందో చూపిస్తాం. కూని రత్నం గారు ఆయన అనుచరులు కూరపాటి ఏడుకొండలు, గొల్లమురి వినోద్ మరియు జనసేన నాయకులు మద్దెల నాగరాజు, నాము వెంకయ్య, గంప నరసయ్య, మిద్ది ధనుంజయ, నాము మని, గంపా చంద్రశేఖర్, మాలపాటి పవన్,మద్దెల భాను ప్రకాష్,దాసరి సురేంద్ర, కూరపాటి ప్రేమ్ కుమార్, ఆస్తోటి బాలాజీ, అల్లాడి వెంకటేష్,గంప పెంచలయ్య, కూనీ కార్తిక్,నాము చంద్రశేఖర్,దాసరి అశోక్, మట్టి గుంట బాబ్జీ తదితరులు పాల్గొన్నారు..
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com