ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం జనసైనికుల 3 వరోజు శాంతియుత దీక్ష
అవనిగడ్డ నియోజకవర్గం,చల్లపల్లి మండలం చల్లపల్లి లో గాంధీ విగ్రహం దగ్గర ప్రయివేటు టీచర్స్, లెక్చరర్ తమ సమస్యల పరిష్కారం కోసం మూడవ రోజు దీక్షను కొనసాగిస్తున్నారు.. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కారించి తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రయివేటు టీచర్స్, లెక్చరర్ లు ఎల్లంకి సురేష్, సి.హెచ్ రమేష్, కూరేటి జగన్, గాంధీ, వెంకటేష్, రాహుల్, విశ్వనాథ్, సునీత రాణి, లక్ష్మణ్, జ్యోతి, లక్ష్మీ, పి.ఏసుబాబు, పి.సురేష్ విజ్ఞప్తి చేశారు.. ఏడు నెలలు నుండి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని ప్రయివేటు టీచర్స్, లెక్చరర్ లు ఆవేదన చెందుతున్నారు.. ఈ దీక్ష కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్, మడమల రంజిత్ కుమార్, విమల్ కృష్ణా, సూదాని నందగోపాల్, మహేంద్ర, తోట సత్యనారాయణ, కిరణ్, బండ్రెడ్డి మల్లికార్జున్, గాజుల శంకర్ రావు, నాగార్జున, మత్తి సుబ్రహ్మణ్యం, కూరేటి రాఘవ, అలమల చందు పాల్గొన్నారు.