
జనసేన పార్టీ అధ్వర్యంలో ” ప్రజా సమస్యల పోరాటనికై జనంలోకి జనసేన” అనే కార్యక్రమంలో భాగంగా 2వ వారం ఒంగోలు జనసేన పార్టీ అధ్వర్యంలో 9వ డివిజన్‌లో గల రాజీవ్ గృహాకల్ప, విలేకర్ కాలని మరియు ఇందిరమ్మ కాలనీలలోకి వెళ్ళి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ప్రధానంగా మురుగు నీరు నిల్వ కారణంగా దోమలు ఎక్కువగా ఉండటం, సైడ్ కాలువలు లేక ఇబ్బందులు, రోడ్డు లేక వర్షకాలంలో నడవడానికె పడుతున్న ఇబ్బందులు, స్థానికంగా ఉన్న పార్క్ పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. అంతేకాకుండా కనీసం రోజు మర్చి రోజు కుడా చెత్తను ఇక్కడి నుండి తొలిగించడం మరియూ బ్లీచింగ్ కుడా చేయలేని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని అన్నారు. ఈ విషయలన్నిటిని ప్రభుత్వ అధికారుల మరియు స్థానిక నాయకుల దృష్టికి తీసుకొనివెళ్ళినా ఇంతవరకు ఎటువంటి ప్రయోజనం లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వీటన్నిటినీ విన్న జనసేన పార్టీ నాయకులు అక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికై వీటిని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. సమస్యలు పరిష్కారం కానిచో స్ధానికులతో కలిసి ఉద్యమిస్తామని జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిల్లి రాజేష్, బండారు సురేష్, ఈదుపల్లి గిరి, మణి, నరహరి సాంబయ్య, చెరుకూరి ఫణి, రమేష్, నరేంద్ర, శంకర్, మాల్యాద్రి నాయుడు, శ్రీను, నాగరాజు, అవినాష్, వీరమహిళలు కోమలి, ప్రమీల, అరుణ పాల్గొన్నారు.