ఆముదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గంలోని చిన్న కురంపేట గ్రామంలో జనసేన నాయకులు కొత్తకోట. నాగేంద్ర, కోరుకొండ. మల్లేశ్వరావు, MPTC. విక్రమ్ ఆధ్వర్యంలో చిన్న సాయి భవాని సమిక్షంలో ఈరోజు గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు ఒక్కప్పుడు చేనేత కార్మికులు విలువైన రోజులు చెప్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరంగా అనిపించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తే మళ్ళీ పాత రోజులు వస్తాయి అని వారికి అండగా ఉంటాం అని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సైరిగాపు. సంతోష్ నాయుడు, కోమల్, మోహన్, కిరణ్ రుద్ర, సాయి, అభి, మహేష్, ప్రదీప్, వినోద్ మరియు గ్రామ ప్రజలు, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com