ఆమదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో నూరు. సంతోష్ గారి అమ్మకి 16నెలలు ముందు రోడ్ ప్రమాదం వలన కోమాలోకి వెళ్లడం జరిగింది. ఇప్పటికి కోలుకోలేని పరిస్థితి అయితే తన కుమారుడు 16నెలలు నుంచి తన మాతృ మూర్తికి సేవ చేయడం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన జనసేన నాయకులు 25,000రూపాయలు ఆర్థికంగా సాయపడ్డారు. జనసేన నాయకులు కొత్తకోట. నాగేంద్ర (మండల అధ్యక్షులు), కోరుకొండ. మల్లేశ్వరావు (ప్రోగ్రాం కమిటీ మెంబెర్), సిక్కోలు. విక్రమ్ (ఎంపీటీసీ & వారహి వాలంటీర్ కోర్ కమిటీ) సహకరించారు.ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి. మురళి మోహన్, స్థానిక నాయకులు వీరగొట్టపు.బాలమురళి, హనుమంతు.అనుష్, చందు,జిమ్ శంకర్, సేపేనా. రమేష్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com