Logo
Date of Publish : 11 December 2022, 5:21 am
Editor : Sake Naresh

నరవ గ్రామంలో గల కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష

పెందుర్తి ( జనస్వరం ) : 88 వార్డ్, నరవ గ్రామంలో గల కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష చేయడం జరిగింది. స్థానిక నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ నరవ గ్రామంలో కళ్యాణ మండపం బడుగు బలహీన వర్గాల ప్రజల శుభకార్యాలకు, పుట్టినరోజులకు వివాహ మహోత్సవములకు, దిన కార్యాలకు, డ్వాక్రా మహిళా శిక్షణ తరగతులకు, మీటింగ్ లకు ఎంతో ఉపయోగంగా ఉండేది. 3 సంవత్సరాల క్రితం నరవ సచివాలయం అద్ది బిల్డింగ్ లో పెట్టడానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేశారు. కానీ రాత్రికి రాత్రే కళ్యాణమండపంలోకి సచివాలయాన్ని పెట్టారు. ఆనాడు జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా వ్యతిరేకించాం, అప్పుడు స్థానిక నాయకులు మేము మీకు 6 నెలలలో కళ్యాణమండపని ప్రజలకు అందుబాటులో తీసుకోని వస్తాం ఈ సచివాలయాన్ని వేరే ప్రదేశంలో మారుస్తామని బదులిచ్చారు. 6 నెలలు గడిచిన తర్వాత పలుమార్లు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసికొని వచ్చిన వారు నుంచి ఏటువంటి స్పందన లేదు. వారి మధ్య వైదొరకు నిరసనగా శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో 24 గంటల నిరాహార దీక్ష చేయడానికి మొదలుపెట్టాం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిలు కళ్ళు తెరిచే ఈ కళ్యాణ మండపం ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి తగు చర్యలు చేయాలని, ప్రభుత్వ పెద్దల దృష్టికి మీడియా వారు కూడా తీసుకొని వెళ్లి మాకు సహకరించాలని కోరడం జరిగింది. స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజల నుంచి పనులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు మ ఏర్పాటు చేయడంలో చిత్తశుద్ధి లేదని, ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్న వారి పరిష్కార మార్గం జనసేన పార్టీ గెలుపు మాత్రమే అని, ప్రజలందరూ జనసేన పార్టీ వైపు నిలబడితే తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ సమస్య లేకుండా పరిపాలన జరుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గండ్రెడ్డి చిన్నారావు, మోటురు చైతన్య, గవర శ్రీను ప్రవీణ్, నాయుడు, శివ, గవర నానాజీ, నవీన్, రవి బాబు, గవర పరమేశు, రాడి తేజ, గీరీ, వీరా మహిళలు మీనాక్షి, జయ మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com