Logo
Date of Publish : 02 October 2020, 10:01 am
Editor : Sake Naresh

22A (చుక్కలు భూములు) సమస్య పరిష్కారం చెయ్యాలని జనసేన పార్టీ అధ్వర్యంలో గాంధేయమార్గంలో శాంతియుత ధర్నా

22A (చుక్కలు భూములు) సమస్య పరిష్కారం చెయ్యాలని జనసేన పార్టీ అధ్వర్యంలో గాంధేయమార్గంలో శాంతియుత ధర్నా

              కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, 22A(చుక్కలు భూములు ) సమస్య పరిష్కారం  చెయ్యాలి అని జనసేన పార్టీ అధ్వర్యంలో జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్ గారి నివాసం దగ్గర ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు శాంతియుత గాంధేయ మార్గంలో ధీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ దీక్షలో జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్ గారు, మత్తి సుబ్రహ్మణ్యం, సూదాని నందగోపాల్, కోన అనిల్ కుమార్, ఆకుశెట్టి రవి కుమార్ పాల్గొన్నారు. చుక్కల భూములు.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు దశాబ్దాల తరబడి తీరని సమస్య. ఈ చుక్కల భూములు తమవేనని రైతులు, కాదు ప్రభుత్వానివని రెవెన్యూ సిబ్బంది మధ్య తగువు తీరే దారి కనబడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల మేర ఉన్న ఈ చుక్కల భూముల్లో 11 లక్షల ఎకరాలు 22ఎ కింద చేరిన భూములు. వీటిలో కొన్నింటికి అనుభవ పట్టాలు కూడా ఉన్నాయి. మిగిలిన 13 లక్షల ఎకరాల పూర్తి చుక్కల భూములు. దశాబ్దాల తరబడి అనుభవంలో ఉండి, రైతులు మాగాణి భూముల్లో  నీటి తీరువా సైతం చెల్లిస్తూ వస్తున్నారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఈ భూముల స్థానంలో చుక్కలు పెట్టి ఉంటాయి. ఆర్.ఎస్.ఆర్(రీ సెటిల్మెంట్ రికార్డు)లో వీటికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరికీ కేటాయించి ఉండవు. అడంగల్స్ కూడా ఉండవు. కొన్ని ఆర్.ఎస్.ఆర్.లో నమోదయ్యి కూడా ఉంటాయి. అయితే ఈ భూములు అవసరానికి అమ్ముకోవడానికి పనికి రావు. చట్ట ప్రకారం 12 సంవత్సరాల పాటు అనుభవంలో ఉంటే దానికి పట్టా ఇచ్చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కోర్టులు సైతం అదే చెబుతున్నాయి. అయితే ఈ చుక్కల భూముల్లో దాదాపు 3 దశాబ్దాలకు పైన అనుభవంలో ఉన్న వారి సంఖ్యే ఎక్కువ. నీటి తీరువాలు సైతం చెల్లిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు వీటిని ప్రభుత్వ భూమి కిందే చూపుతున్నారు. రైతులు కాదు అవి మా భూములు అంటున్నారు.

                       చుక్కల భూముల రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ కూడా జనసేన పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోనే సుమారు 14 వేల ఎకరాలకు పైగా చుక్కల భూములు ఉన్నాయి. 10 వేల మంది రైతులు బాధితులుగా ఉన్నారు. తీరప్రాంత మండలాలు అయిన నాగాయలంకలో 4,500 ఎకరాలు, కోడూరు పరిధిలో 9,500 ఎకరాలు చుక్కల భూములు ఉన్నాయి. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు సైతం ఈ భూములు అక్కరకు రావడం లేదు. సొంత భూములు ఉండి ఎందుకూ ఉపయోగపడక రైతులు నరకం అనుభవిస్తున్నారు. రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం శూన్యం. దీంతో రంగంలోకి దిగిన జనసేన నాయకులు రైతుల తరఫున ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రంజిత్ కుమార్ మడమల, బండ్రెడ్డి మల్లికార్జున, బొడ్డు విజయ్, కూరేటి రాఘవ, విమల్ కృష్ణా చోడగం, చిరు గోపి పాల్గొన్నారు. పెద్దలు తోట వెంకటేశ్వరరావు గారు వచ్చి తమ మద్దతు ను తెలియజేశారు. బీజేపీ నాయకులు పీతా లక్ష్మీ ప్రతాప్ పాల్గొని తన మద్దతును తెలియజేశారు. 

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com