చుక్కల భూముల రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ కూడా జనసేన పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోనే సుమారు 14 వేల ఎకరాలకు పైగా చుక్కల భూములు ఉన్నాయి. 10 వేల మంది రైతులు బాధితులుగా ఉన్నారు. తీరప్రాంత మండలాలు అయిన నాగాయలంకలో 4,500 ఎకరాలు, కోడూరు పరిధిలో 9,500 ఎకరాలు చుక్కల భూములు ఉన్నాయి. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు సైతం ఈ భూములు అక్కరకు రావడం లేదు. సొంత భూములు ఉండి ఎందుకూ ఉపయోగపడక రైతులు నరకం అనుభవిస్తున్నారు. రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం శూన్యం. దీంతో రంగంలోకి దిగిన జనసేన నాయకులు రైతుల తరఫున ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రంజిత్ కుమార్ మడమల, బండ్రెడ్డి మల్లికార్జున, బొడ్డు విజయ్, కూరేటి రాఘవ, విమల్ కృష్ణా చోడగం, చిరు గోపి పాల్గొన్నారు. పెద్దలు తోట వెంకటేశ్వరరావు గారు వచ్చి తమ మద్దతు ను తెలియజేశారు. బీజేపీ నాయకులు పీతా లక్ష్మీ ప్రతాప్ పాల్గొని తన మద్దతును తెలియజేశారు.
