
పాకారాయపేట మండలంలో ముఖ్యవ్యాపార కేంద్రమైన తిమ్మాపురం మేజర్ పంచాయితీకి జనసేన మద్దతుగా నిలుచున్న నర్పంచ్అభ్యర్థి కావ్య గెలుపునకు కృషిచేస్తానని జనసేన నాయకులు బోడపాటి శివదత్ అన్నారు. బుధవారం తిమ్మాపురం, అడ్దురోడ్డు జంక్షన్లో యువ మహిళా నర్పంచ్ అభ్యరిి కావ్యను కలసి మాట్లాడారు. జనసేన అధినేత పవన్కళ్యాణ్ రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత కల్పించాలనే దృడ నంకల్పంతో పనిచేస్తున్నారన్నారు. ఆయన మనోభావాలకు అనుగుణంగానే చాలా గ్రామాల్లో చదువుకున్న యువతీ యువకులకు జనసేన మద్దతు తెలువుతుందన్నారు. తిమ్మాపురం లాంటి మేజర్ పంచాయితీకి చెందిన ఎంబిఏ చదువుతున్న 21 ఏళ్ళ యువ మహిళా సర్పంచ్ అభ్యర్శిగా నామినేషన్ దాఖలు చేయడం ఆనందంగా ఉందన్నారు. మా జనసైనికులు కావ్యకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. మా జనసైనికులతోపాటు బీజేపీ మద్దతు కూడా లభించడం ఆనందంగా ఉందన్నారు. తిమ్మాపురంలో జనసేన బలపరిచిన అభ్యర్ది కావ్య గెలుపు ఖాయమని భావిస్తు రు. ఆయన వెంట పప్పుల శివ, ప్రసాదుల సేనాపతి లోవరాజు , గణేశ్, లింగంపల్లి జ్యోతికుమార్ తదితర సైనికులు, కార్యకర్తలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.