-బోసుబొమ్మ వద్ద విగ్రహం లేకపోవడంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చితపటానికి పుష్పాంజలి
-ఆత్మకూరు బస్టాండ్ కూడలిలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పుష్పాంజలి
-దారి పొడవునా కేతంరెడ్డి వినోద్ రెడ్డికి ప్రజల జేజేలు
-హారతులిచ్చి విజయతిలకం దిద్దిన వీరమహిళలు
-ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిలో మురికి నీటిలో నడుస్తూ సాగిన పవనన్న ప్రజాబాట
-పూల వర్షం కురిపించిన ఆత్మకూరు బస్టాండ్ కూడలి వర్తకులు
-పలు సమస్యలపై అర్జీలు అందించిన వివిధ వర్గాలు
-ఉత్సాహంతో కేరింతలు కొట్టిన నెల్లూరు సిటీ జనసేన యువసైనికులు
-రాజపుత్రులు అందించిన తల్వార్ చేతబట్టిన కేతంరెడ్డి
-తడికలబజారు కూడలిలో ప్రసంగిస్తూ వైసీపీ విధానాలను, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అసమర్థతను ఎండగట్టిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 200వ రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత నెల్లూరు నగరం బోసుబొమ్మ కూడలి వద్ద గుమిగూడిన జనసేన పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి కేతంరెడ్డి సర్వమత ప్రార్ధనలు జరిపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోసుబొమ్మ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం లేకపోవడంతో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించిన అనంతరం ఆత్మకూరు బస్టాండ్ వైపు కదిలారు. ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిలో ఎటువంటి వర్షం లేకపోయినా కూడా మోకాల్లోతు డ్రైనేజీ నీరు ఉండడంతో ఆ నీటిలోనే నాయకులు, కార్యకర్తలు నడిచి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకుని విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ క్రమంలో ఆత్మకూరు బస్టాండ్ వద్ద వ్యాపారం నిర్వహించే పలువురు పూల వర్తకులు అభిమానంతో కేతంరెడ్డి వినోద్ రెడ్డి పై పూల వర్షం కురిపించారు. జనసేన పార్టీ వీరమహిళలు కేతంరెడ్డికి వీరతిలకం దిద్ది హారతులివ్వగా ఇదే ప్రాంతంలో ఆదిమజాతి నక్కలోళ్ళు, చిరు వ్యాపారులు తమ సమస్యలు ఏకరువు పెడుతూ వినతిపత్రం అందించారు. అనంతరం స్టోన్ హౌస్ పేట ప్రధాన వీధిలో కార్యకర్తల కోలాహలం, కేరింతల నడుమ కార్యక్రమాన్ని సాగించారు. డప్పుల కళాకారులు చప్పుళ్లతో ప్రజాబాటలో కొనసాగగా మధ్యలో స్వచ్ఛందంగా ఎదురైన నాయీబ్రాహ్మణులు మంగళవాయిద్యాలతో తమ సంఘీభావం తెలిపారు. జాలరి వలలతో ఎదురొచ్చిన మత్స్యకారులు తమ సమస్యలను ఏకరువు పెడుతూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలంటూ కేతంరెడ్డికి వినతిపత్రం అందించారు. దారి పొడవునా పలువురు స్టోన్ హౌస్ పేట వర్తకులు కేతంరెడ్డికి శాలువా, పూలమాలలతో స్వాగతం పలికారు. తడికల బజారు కూడలిలో ఎమ్మార్పీఎస్ నాయకులు పలువురు కేతంరెడ్డికి వినతిపత్రం అందించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరారు. జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు తమ మద్దతును తెల్పుతూ సంఘీభావంగా కేతంరెడ్డిని సత్కరించారు. డప్పు కళాకారుల కోరిక మేరకు కేతంరెడ్డి ఈ కూడలిలో డప్పుని వాయించారు. రాజపుత్ర సింగ్ లు కేతంరెడ్డికి తల్వార్ ని బహుకరించి దానిని చేతపట్టాల్సిందిగా కోరగా కేతంరెడ్డి తల్వార్ చేతబట్టారు. జనసేన పార్టీ శ్రేణులు భారీ గజమాలతో కేతంరెడ్డిని సత్కరించిన అనంతరం కేతంరెడ్డి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ విధానాలను, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అసమర్థత, అవినీతిని తెల్పుతూ తడికలబజారు సెంటర్లో ప్రజలను, స్టోన్ హౌస్ పేట వర్తకులను ఉద్దేశించి ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకతను తన ప్రసంగంలో తెల్పిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన జనసేన శ్రేణులకు ధన్యవాదాలు తెల్పుతూ, పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని అపూర్వంగా ఆదరిస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తానని, ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని, నెల్లూరు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పవుజెని చంద్రశేఖర్ రెడ్డి కాకు మురళీ రెడ్డి సారథి కనకేశ్వర్ రావు కార్తిక్ హేమంత్ రాయల్ ప్రభాకర్ జీవన్ రాము వర ప్రసాద్ వినయ్ జాఫర్ శ్రీకాంత్ చరణ్ తేజా సియొన్ పవన్ సుజన్ సింగ్ వీర మహిళలు ఝాన్సి సునందా సృజనా కుసుమా జాయిశ్రి తదితరులు పాల్గొన్నారు.