Logo
Date of Publish : 08 August 2020, 9:12 am
Editor : Sake Naresh

శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా 200 మొక్కలు నాటిన జనసైనికులు

  శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా 200 మొక్కలు నాటిన జనసైనికులు 

       జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా JSP ALL నియోజకవర్గం టీమ్ తలపెట్టిన గ్రీన్ ఛాలంజ్ లో భాగంగా ఈరోజు “ప్రకృతి పరిరక్షణ దినం” సందర్భంగా గొప్ప పర్యావరణవేత్త శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారి స్ఫూర్తితో మాడుగుల నియోజకవర్గం, ఖండివరం గ్రామంలో సహాయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ బొయిదాపు కిరణ్ గారి ఆధ్వర్యంలో 200 మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రేపటి తరం యువత, నేటి తరం యువతతో కలిసి కొన్ని మొక్కలు నాటటం జరిగింది. ఈ కార్యక్రమంలో బొయిదాపు కిరణ్ మాట్లాడుతూ గ్రీన్ ఛాలంజ్ లో భాగంగా అధ్యక్షుల వారి పుట్టిన రోజులోపు నియోజకవర్గ వ్యాప్తముగా కొన్ని వందల మొక్కలు నాటటానికి శ్రీకారం చుట్టామని, అందులో భాగంగానే ఈరోజు రేపటి భవిష్యత్ అయినటువంటి చిన్న పిల్లలు సైతం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకి వచ్చి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టటం, ఆయన అడుగుజాడల్లో నడవటం శుభపరిణామం అని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరు మీ మీ పరిధిలో మొక్కలు నాటి అధ్యక్షుల వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపవలసినదిగా కోరుచున్నాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనాధు విజయ్, వాసు, రెడ్డి త్రినాధ్, రామకృష్ణ తదితర జనసైనికులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com