Logo
Date of Publish : 07 November 2022, 2:08 pm
Editor : Sake Naresh

మద్దికెర మండలంలో జనసేన పార్టీలోకి సి.జి రాజశేఖర్ ఆధ్వర్యంలో 20 కుటుంబాల చేరికలు

             పత్తికొండ ( జనస్వరం ) : మద్దికేర మండలం నాయకులు, గద్దల రాజు, అశోక్, గద్దల అజయ్, కంబగిరి, లవన్న, ఆధ్వర్యంలో పత్తికొండ జనసేన నాయకులు సిజి రాజశేఖర్ సమక్షంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి 20 మంది బీసీ, ఎస్సీ కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. అనంతరం సిజి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ఓసి కులాలకు సంబంధించిన సల్మాన్, వెంకటరామిరెడ్డి, మహబూబ్ బాషా, C.మద్దన్న, S.హరికృష్ణ, నరేష్, ఎండే రాము, గోపి, భరత్, అనుమేష్, లవన్న, వంశి, కాశిం, రామచంద్ర, , ఉదయ్ మహేష్, శంకర్, వెంకట్, రామంజి, మరియు తదితరులు సోదరులు పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. రాజకీయంగా ఆర్థికంగా సమాజంలో ఎదుగుదలను కొరకు బడుగు బలహీన వర్గాలను పల్లకిలో ఎక్కించడానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారని తెలియజేశారు. పత్తికొండ నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి జనసేన పార్టీతోనే సాధ్యమవుతుంది. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, అధికారంలోకొస్తే కనుక బడుగు, బలహీన వర్గాలకు జనసేన పార్టీలో కీలక పదవులు కూడా ఆయా వర్గాలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ టౌన్ నందు రోడ్డు వెడల్పు చేపట్టాలని గత 30 సంవత్సరాలు నుంచి ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న అదిగో ఇదిగో అంటూ కొలతలతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గంలో రోడ్డు వెడెల్పు కార్యక్రమంలో వెంటనే చేపట్టాలని జగన్ రెడ్డిని కోరుచున్నామన్నారు. నిజంగా ట్రాఫిక్ సమస్య ఉన్నచోట వదిలేసి ఇప్పటం ప్రజలపై కక్ష సాధింపు తప్ప వేరే ఆలోచన లేదన్నారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారు రోడ్డు వెడల్పు చేపడతామని పూజ కార్యక్రమాలు చేసి ఇప్పటివరకు రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపట్టలేదు.  మీ గ్రామాలలో మీ వార్డులలో సమస్యలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. వారి తరఫున పోరాడుదాం ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ గారు నిలిచిపోయేలా మనమంతా కలిసి పోరాడుదాం, విజయం సాధిద్దాం అని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com