Logo
Date of Publish : 22 August 2021, 3:00 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 19వ రోజు సేవా కార్యక్రమాలు

                జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 30 రోజులు 30 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 19వ సేవా కార్యక్రమము ఆదివారం చిట్వేలి మండల పరిధిలోని మారుమూల గిరిజన కాలనీ అయిన ఇందిరమ్మ ఎస్‌టి కాలనీలో 40 కుటుంబాలకు జనసేన నాయకుడు మాదాసు నరసింహ దాతృత్వంతో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ యువ నాయకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలకు సహాయం చేయడం కోసం తమ వంతుగా ఎల్ల వేళల కృషి చేస్తామని తెలిపారు. అలాగే సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గిరిజనులు చేత కేక్ కటింగ్ చేపించి మిఠాయిలు పంచుకుని ఆనందంగా జరుపుకున్నారు. సేవ చేయడానికి అధికారం అవసరం లేదని బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ ఇలా చేతల్లో చేసి నిరూపించిన చిరంజీవి గారికి గిరిజన వాసులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గిరిజనులను గుర్తించి ఇంత దూరం వచ్చి సహయం అందించిన జనసేన పార్టీ నాయకులకు మరియు చిరంజీవి అభిమానులకు గిరిజనులు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు పురం సురేష్, నాగిశెట్టి నాగేంద్ర, దండు రమేష్, సువ్వారపు భానుప్రకాశ్, సువ్వారపు హరిప్రసాద్, ఈడిగపల్లి నాగేంద్ర, బాలు సుంకర నవీన్, జబీద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com