ఆత్మకూరు, (జనస్వరం) : జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం ఈరోజు 19వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని జగన్నాథరావు పేటలో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేనపార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీగా రూపాంతరం చెంది పుష్కరకాలము గడిచినప్పటికీ నేటికీ మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు. సకల సౌకర్యాలతో ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేనపార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేనపార్టీ నాయకులు వంశీ, చంద్ర, పవన్, తిరుమల, నాగరాజు, అనిల్, భాను, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com