గాజువాక ( జనస్వరం ) : రాష్ట్ర భవిష్యత్తుకు, యువతకు మార్గం చూపగలిగే నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాత్రమేనని నమ్మి గాజువాక నియోజకవర్గం 70వ అధ్యక్షులు లంకల మురళీ దేవి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. PAC సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి కోన తాతారావు సమక్షంలో వార్డు LV నగర్ వైస్ ప్రెసిడెంట్ తుంపాల చిరంజీవి, వారి అనుచరులు సుమారు 150 మంది జనసేన పార్టీ లో చేరారు. చిరంజీవి గారు మాట్లాడుతూ జనసేన పార్టీ విధి విధానాలు, ప్రజల సమస్యలపై పోరాడుతున్న తీరు, ప్రజల శ్రేయస్సు కోసం అండగా నిలబడుతున్న జనసేన పార్టీ లో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. రాష్ట్రంలో వైసిపి పాలన అంతం బోతుందని, జనసేన - టిడిపి ప్రభుత్వం ఏర్పడుతుందని, దీనికి సంకేతమే రాష్ట్రం మొత్తం జనసేన పార్టీ లో భారి చేరికలు జరుగుతున్నాయని మురళి దేవి అన్నారు. కోన తాతారావు మాట్లాడుతూ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరమని భావించి ప్రజలు రాబోయే ఎన్నికల్లో జనసేన, టిడిపి ఉమ్మడి నాయకత్వానిక అధికారమీవ్వాలనే ఆలోచనతో ప్రజలున్నారన్నారు. జనసేన పార్టీలో పార్టీ లో చేరిన వారికి పార్టీలో సముసితమైన స్థానం ఇచ్చి గౌరవం ఇస్తామన్నారు. 70వ వార్డు వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు లంకల మురళి దేవి, సీనియర్ నాయకుల కర్రీ శ్రీకాంత్, వార్డ్ ఉపాధ్యక్షులు కురిటి సూరిబాబు, వార్డ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. జాయిన్ అయిన వారిలో ముఖ్యలు తుంపాల జగదీశ్వరి, సిరిసపల్లి లక్ష్మి, శివ కృష్ణ, టంకాల సతీష్, కె హరీష్, ధర్మశెట్టి శివాజి, అప్పలరాజు, చరణ్, నవీన్, ధనుష్, కార్తిక్, చైతన్య, సత్యనారాయణ తదితరులు జనసేన పార్టీలో చేరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com