నెల్లూరు ( జనస్వరం ) : జనసేన ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ 10వ డివిడన్ పత్తి వారి స్కూలు వద్ద అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ సౌజన్యంతో జనసేన నాయకులు వెంకటరమణ దాదాపు గా 15 పూరి గుడిసె ల పై పట్టలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ... పేరుకు సిటి యే గాని కొన్ని ప్రాంతాల్లో పేదలు దశాబ్దాలు దాటి ఇలా పూరిగుడిసెలో ఎండకి ఎండి వానక తడుస్తూ బతికేస్తున్నారు. హౌస్ ఫర్ ఆల్ అంటూ ప్రభుత్వం అమలు చేయాల్సిన పథకాలు ఇటువంటి వారికి వర్తించవా... జనసేన పార్టీ ఆధ్వర్యంలో సిటీ నిర్దేశకులు వేములపాటి అజయ్ గారి సూచనలతో పత్తి వారి స్కూల్ వద్ద పై పట్టలను కప్పి పేదల పేదవారికి కొంతవరకు ఊరట ఇవ్వడం జరిగింది. బయటకు వెళ్లినప్పుడు కాసేపు వర్షం కురిస్తే చాలు ఇంటికెళ్లి బట్టలు మార్చుకునేదాకా చిరాకుగా ఉంటుంది చిన్నపాటి వానలో గొడుగు వేసుకున్నప్పుడు చిన్న దానికి చిల్లులు ఉంటే తీవ్రమైన అసహనం వ్యక్తపరుస్తారు. అటువంటిది పేదలు దశాబ్దాలుగా చిరాకు, అసహనంతోనే ఈ పూరి గుడిసెల్లో కాపురం ఉంటున్నారు. నెల్లూరు సిటీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అనే నాయకులకు సిటీ లో ఇలాటి ప్రదేశాలు కనబడవా..? ఇది సిటీ ఏనా అనిపిస్తుంది. ఇటువంటి వారిని ఓట్లు ఉపయోగించుకొని కోట్లు సంపాదిస్తున్న నాయకులు కనీస వస్తువులు కల్పించి వాళ్ళ గృహాలను మెరుగుపరిచేందుకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. మేము కప్పిన 5000 రూపాయల లోపు పట్టా వాళ్ళకి పూర్తి ఊరటఅయితే ఇవ్వలేదు. కానీ ప్రభుత్వానికి ఈ విషయం గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాము. వీరిని కూడా మనుషులుగా గుర్తించి విలాసాల్లో మునిగితేరుతున్న మీరు కనీస సౌకర్యాల్ని వీళ్ళకి కల్పించాల్సిందిగా జనసేన పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము.
సిటీలో కొన్ని ప్రాంతాల్లో పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారి గృహాలను ఆధునికరం చేసుకోవడానికి కానీ లేదంటే మరొక చోట ఇల్లు ఇచ్చే ప్రత్యామ్నాయంగా అక్కడికి పంపే ప్రయత్నం చేయగలరని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వాలు కట్టిన హౌస్ ఫర్ ఇల్లు అలాగే ఎందుకు ఉంచారు.పేదలకు ఇవ్వాలనే ఆలోచన వైసిపి ప్రభుత్వానికి ఉందంటారా..? రోజుకో కొత్త శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంబ ఆర్బాటాలు, సభల నిర్వహించే బదులు ఇలాంటి వారికి అందిన కాడికి ప్రభుత్వం సహాయం అందిస్తే మంచిదని అభిప్రాయం. ఈ పేదలకు నిరాశ్రయులుగా గుర్తించి ఇల్లు ఇప్పించాల్సి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. కానీ పక్షంలో ప్రజా ప్రభుత్వంలో వీరందరూ కూడా పక్కా గృహలు ఇప్పిస్తాం.. కష్టమంటే తెలిసిన వ్యక్తి పేదలకు అండగా ఉండగలిగిన వ్యక్తి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరిస్తేనే పేదల కష్టాలు తీరే మంచి రోజులు వస్తాయి. సిటీనిర్దేశకులు ఆ వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో చిరంజీవి యువత నాయకులు, జనసేన సిటీ మద్దతుదారులందరూ కలిసి రానున్న రోజుల్లో సిటీలో మరిన్ని కార్యక్రమాలు చేసి జనసేన పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. 11 డివిజన్లో ఇన్చార్జిగా ఉన్న రమణ గతంలో కూడా జనసేన పార్టీ తరఫున ధైర్యంగా ఎన్నికల్లో నిలబడి పోరాడారు. స్థానికంగా ఉన్న సమస్యలను చాలాసార్లు పోరాడి పేదలకు చీరలు పంపడం వంటి మంచి సామాజిక కార్యక్రమాలతో మంచి గుర్తింపు పొందారు.రానున్న రోజుల్లో మరింత చురుకుగా ఉండి ప్రజా ప్రభుత్వంలో ఒక భాగస్వామి కావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, జనసేన సీనియర్ నాయకులు చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏటూరి రవికుమార్, జనసేన సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి,11వ డివిజన్ ఇంచార్జ్ రమణ, ఐదో డివిజన్ జనసేన నాయకులు మోష, కోవూరు జనసేన కేర్ టేకర్ గుడిహరి రెడ్డి, పదో డివిజన్ జనసేన నాయకులు పత్తి రాము, వీర మహిళలు నాగరత్నం, రేణుక, జనసేన ముఖ్య నాయకులు ప్రభాకర్, విష్ణు, శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com