జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 14వ రోజు కర్నూలులో న్యాయం కోసం పోరాడుతున్న సుగాలీ ప్రీతి తల్లికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ గౌరవ సభ్యులు అల్లం రమణ దాతృత్వంతో సుగాలి ప్రీతి అమ్మ పార్వతమ్మ గారికి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా నాయకులు ఆర్షద్ ఖాన్ చేతుల మీదగా పార్వతమ్మ గారికి అందజేశారు. ఈ ఆర్థిక సహాయం దాత అయినటువంటి అల్లం రమణ గారిని ఆర్షద్ గారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా నాయకులు అర్షద్ గారు మాట్లాడుతూ నిరుపేద మహిళలకు అండగా ఉండేందుకు జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్, అల్లం రమణలకు తన శుభాకాంక్షలు తెలిపారు. జనసేన నాయకులు రెడ్డిపోగు రాజశేఖర్ మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ మాతృభూమికి, జనసేన బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ సభ్యులందరూ ఎంతో ధన్యులని, ఈ సందర్భంగా సహాయ దాత కి అల్లం రమణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి పోగు రాజశేఖర్, షేక్ రెహమాన్, ఎస్ ఎన్ డి వలీ, మోహన్ నాయక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com