Logo
Date of Publish : 28 November 2021, 3:30 pm
Editor : Sake Naresh

విజయవాడ జనసేన పార్టీ ఆఫీసులో జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి వేడుకలు

- నివాళులర్పించిన విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్
- జగన్మోహన్ రెడ్డి పదేపదే బీసీల అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ క్లాస్ అని చెబుతూనే ‘బీసీల ‘ వెన్నుముక వీరిచేస్తున్నారు.
- బీసీ జనాభా గణన చేపట్టాలని అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం.. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ సమాచారం సేకరించి సుప్రీంకోర్టులో ఫైల్ చేసి ఉంటే బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కోల్పోయే వారు కారు
        విజయవాడ, (జనస్వరం) : తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న పూలే కాంస్య విగ్రహానికి జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, నగర కమిటీ, అమ్మ వారి ధార్మిక సేవ మండలి సభ్యులు కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థులు, యువ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అట్టడుగు వర్గాలు సామాజికంగా ఎదగాలని రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని ఉన్నత విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించాలని, నిరంతరం పోరాడినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, మహిళలకు విద్య ఎంతో అవసరమని, మొట్టమొదటి పాఠశాలను కూడా వారే స్థాపించారని కొనియాడారు. పూలే ఆశయాలను సిద్ధాంతాలను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆచరిస్తున్నారని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతానికి పైగా బలహీనవర్గాలకు చెందిన వారికే సీట్లు కేటాయించారని తెలియజేశారు. వైసీపీ, సీఎం జగన్ రెడ్డి బీసీల ద్రోహం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి పడిపోవడం వల్ల 18 వేల మంది బీసీలు రాజ్యాధికారానికి దూరమయ్యారని బీసీలకు జగన్మోహన్ రెడ్డి బిక్షా అవసరం లేదని, జగన్ రెడ్డికి బీసీలు మద్దతిచ్చి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారన్న విషయం మర్చిపోవద్దు అన్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పదేపదే బీసీల అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని చెబుతూ బ్యాక్ బోన్ క్లాస్ జగన్మోహన్ రెడ్డి చెబుతూ బీసీల వెన్నుముక వీరిచేస్తున్నారని
1. పేదింటి ఆడపిల్లలకు పెళ్ళికానుక పధకం రద్దు చేశారని
2. సబ్సిడీ రుణాలు మంజూరు ఎత్తి వేశారని
3. విదేశీ విద్యా పథకం అటకెక్కించారని
4. ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ కు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు పేద విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కోచింగ్ సెంటర్లలో ఐఏఎస్ కోచింగ్ తీసుకునేందుకు వారిని దూరం చేశారని
5. బీసీ జనాభా గణన చేపట్టాలని అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం గారు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ సమాచారం సేకరించి సుప్రీంకోర్టులో ఫైల్ చేసి ఉంటే బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కోల్పోయేవారు కారని జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పదేపదే బీసీలను మభ్యపెడుతున్నారని వారి అభివృద్ధి సంక్షేమం రాజ్యాధికారానికి చిత్తశుద్ధితో ఏనాడు పనిచేయలేదని తెలియజేశారు. బీసీలు జగన్ రెడ్డి చేస్తున్న కుట్రలను కుయుక్తులను గ్రహించి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర కమిటీ సభ్యులు వెన్నా శివశంకర్, శనివారపు శివ, కృష్ణ మోహన్, మురళి కృష్ణ, పల రజిని, అమ్మ వారి ధార్మిక సేవ మండలి సభ్యులు పసుపులేటి విజయలక్ష్మి, ప్రముఖ న్యాయవాది పిళ్ల శ్రీనివాసరావు బీసీ సంఘo విజయవాడ మహిళా అధ్యక్షురాలు జ్యోతి, జనసేన నాయకులు బొలిశెట్టి వంశీ కృష్ణ, పిళ్లి శ్రీనివాసరావు, కూరాకుల సురేష్, బాదరాల శివ, రాము, మరూపిళ్ల చిన్నారావు, రాజా నాయుడు, నూనె సోమశేఖర్, గంగాధర్, వడ్డాది రాజేష్, పండు, సాంబశివ, దేవ కృష్ణ, రాజేష్, పొట్నూరి ప్రసాద్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com