Logo
Date of Publish : 07 March 2023, 3:28 pm
Editor : Sake Naresh

జాబ్ క్యాలండర్ ఎంత అబద్ధమో 13 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా అంతే అబద్ధం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 295వ రోజున 46వ డివిజన్ కాపువీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటినీ సందర్శించి సమస్యలను అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రెండేళ్ళ క్రితం పత్రికల్లో మొదటి పేజీలలో ఆకర్షణీయంగా వేసిన జాబ్ క్యాలండర్ తరహాలోనే ప్రస్తుతం ప్రకటించిన 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయని అన్నారు. ఆనాడు ప్రకటించిన జాబ్ క్యాలండర్లో ఏ ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదని, ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ వేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట మడమ తిప్పి పోయిందని, అదే తరహాలో ఇంక ఎన్నికలకు ఏడాది కాలం ఉందనగా ప్రకటించిన 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులన్నీ గాలి మూటలే అని అన్నారు. ఎన్నికల ఏడాదిలో ఏమైనా ప్రకటిస్తే అదంతా డ్రామానే అని గతంలో ప్రకటించిన సీఎం జగన్ రెడ్డి గారు మరి ఈ డ్రామాల గురించి ఏమి చెప్తారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని అమాయకులుగా భావించి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, ప్రజలేమంత అమాయకులు కారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పేందుకు, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com