ఒంగోలు ( జనస్వరం ) : 12వ డివిజన్ అధ్యక్షులు అనిల్ కుమార్ కటకంశెట్టి గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 51వ రోజు ఒంగోలులోని 12వ డివిజన్ రంగుతోట లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు జనసేన నాయకులతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో మమ్మల్ని బాగా ప్రభావితం చేసిందని, బడుగు బలహీన వర్గాలను ఇప్పటివరకు అందరూ ఓటు బ్యాంకు గానే చూశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంకుగా కాకుండా వారిని కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తామని చెప్పడం మమ్మల్ని బాగా ఆకర్షించాయని, అలానే స్థానిక యువత కూడా మాట్లాడుతూ సరైన ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నామని తాను అధికారంలోకి వస్తే పదిమందికి ఉపాధి కల్పించేలా యువతను తయారు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం మాకు బాగా నచ్చిందని అలాంటి నాయకుడి వెంట నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తమ పూర్తి మద్దతు జనసేన పార్టీకి ఉంటుందని నాయకులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, జనసేన నాయకులు సుధాకర్ పసుపులేటి, జె.మహేష్, సాయి, భవాని, జనసేవ శ్రీనివాస్, ఉంగరాల వాసు, యాదల సుధీర్,కే. నవీన్, రవీంద్ర, అవినాష్ పర్చూరి, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com