– పార్టీలో పలువురు చేరికలు
– సిద్ధాంతాలతో కూడియున్న క్యాలెండర్ విడుదల
– నాలుగు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశం
విజయనగరం, (జనస్వరం) : జనసేనపార్టీ సిద్ధాంతాలతో ఉన్న పార్టీ అని, పవన్ కళ్యాణ్ గారి ఆశయం నుండి పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ పాలవలస యశస్వి అన్నారు. మంగళవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడియున్న 2022వ నూతన సంవత్సర పోకెట్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయంతో, కొన్ని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఓ కొత్త ఓరవడిని సృష్టించేందుకు పార్టీని స్థాపించారని, పాతిక కేజీల బియ్యం కోసం కాదని, పాతిక సంవత్సరాల యువత భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ఆవిర్భవించిందని, రాష్ట్రంలో ఏపార్టీకి సిద్ధాంతాలు లేవని, సిద్ధాంతాలతో కూడియున్న ఒకేఒక పార్టీ జనసేన అని అన్నారు. అనంతరం ఈ నెల 9,10వ తేదీల్లో ఉత్తరాంధ్రలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసేందుకు విశాఖపట్నంలో త్రిసభ్య కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో విజయనగరం, నెలిమర్ల, ఎస్.కోట, చీపురుపల్లి నియోజకవర్గ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రతీఒక్కరూ పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, పవన్ కళ్యాణ్ ఆశయాలను,పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎస్.కోట నియజకవర్గం, దెందూరు గ్రామస్తులు పదిమంది యశస్వి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో ఎస్.కోట, నెల్లిమర్ల,చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గ ముఖ్య నాయకులతోపాటు వీరమహిళలు, జనసైనుకులు భారీగా హాజరయ్యారు.